»Reunification Is Not Possible Even If You Touch The Border There Is No Peace It Is War Kim
kim jong un: సరిహద్దును తాకినా యుద్ధమే.. కిమ్ హెచ్చరిక
కొరియా దేశాల పునరేకీకరణ, సహకారం కోసం ఏర్పాటుచేసిన ఏజెన్సీలను కిమ్ రద్దు చేశారు. ఇరు దేశాల మధ్య సముద్ర సరిహద్దులను, నార్తర్న్ లిమిట్ లైన్ను గుర్తించమన్నారు. ఉత్తర కొరియా సరిహద్దులను ఆక్రమించాలని చూస్తే యుద్ధం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
Reunification is not possible. Even if you touch the border, there is no peace, it is war.. Kim
kim jong un: ఉత్తరకొరియా(North Korea), దక్షిణ కొరియా(South Korea)ల మధ్య పునరేకీకరణ, సహకారం కోసం ఏర్పాటుచేసిన ఏజెన్సీలను కిమ్ జోంగ్ ఉన్(kim jong un) రద్దు చేశారు. సరిహద్దును టచ్ చేయాలని చూసినా యుద్ధం తప్పదని కిమ్ హెచ్చరించారు. రెండు దేశాల మధ్య సముద్ర సరిహద్దులను, నార్తర్న్ లిమిట్ లైన్ను గుర్తించమన చెప్పారు. సియోల్ను యుద్ధంలో ఆక్రమించుకునేలా రాజ్యాంగ సవరణలు చేయాలన్నారు. ఈ విషయాన్ని ఉత్తర కొరియాకు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ది కొరియన్ సెంట్రల్ తెలిపింది. ఉత్తర కొరియాలోని సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో కిమ్ ప్రసంగించాడు. పునరేకీకరణ కోరడం జరగని పని అని తేల్చిచెప్పాడు. దక్షిణ కొరియాను అతిపెద్ద శత్రువుగా పేర్కొంటూ చట్టాల్లో మార్పులు చేయాలన్నారు.
కొరియా ద్వీపకల్పంలోని సియోల్ను పూర్తిగా ఆక్రమించుకొనే చట్ట సవరణలు చేయాలని అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశం ఉ.క సరిహద్దు భూమి, సముద్ర, గగనతలాల్లో 0.001 మి.మీ. అతిక్రమణకు పాల్పడినా.. దానిని యుద్ధ కవ్వింపు చర్యగానే పరిగణిస్తమన్నారు. అమెరికా, దక్షిణ కొరియాలు ఈ చర్యలకు పాల్పడితే వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని కోరారు. మరోవైపు హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించినట్లు ప్రకటించింది. ఇప్పుడు కిమ్ చేస్తున్న పనికి అమెరికా, దక్షిణకొరియాలకు తలనొప్పిగా మారింది.