»Amazon Rainforest The Oldest City In The Amazon Rainforest
Amazon Rainforest: అమెజాన్ అడవుల్లో అతి పురాతన నగరం
పురాతన శాస్త్రవేత్తలు అమెజాన్ అడవుల్లో ఇటీవల ఓ నగరాన్ని కనిపెట్టారు. 2000 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండేది. ఆ తర్వాత మరుగుపడిన పురాతన నగరాన్ని శాస్త్రవేత్తలు అమెజాన్ అడవుల్లో కనిపెట్టారు.
Amazon Rainforest: పురాతన శాస్త్రవేత్తలు అమెజాన్ అడవుల్లో ఇటీవల ఓ నగరాన్ని కనిపెట్టారు. 2000 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండేది. ఆ తర్వాత మరుగుపడిన పురాతన నగరాన్ని శాస్త్రవేత్తలు అమెజాన్ అడవుల్లో కనిపెట్టారు. ఇరవైఏళ్ల క్రితం ఇక్కడ మట్టిదిబ్బలు, పూడుకుపోయిన రోడ్లను స్టీఫెన్ రోస్టైన్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. అయితే అక్కడ ఓ నగరం ఉంటుందని ఊహించలేదు. 2015లో లేజర్ సాంకేతికతో ఈ ప్రాంతాన్ని విశ్లేషించారు. అయితే ఆ ఫలితాలను శాస్త్రవేత్తలు తాజాగా తెలిపారు. ఒకప్పుడు ఇక్కడ రోడ్లను కలుపుతూ జనావాసాల నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించారు. 500 బీసీ నుంచి 300-600 ఏడీ వరకు ఉపానో ప్రజలు ఇక్కడ జీవించినట్లు భావిస్తున్నారు.
ఇక్కడ స్థానిక మట్టి దిబ్బలపై 6000 ఇళ్లు, భవనాలు నిర్మించగా చుట్టూ వ్యవసాయ క్షేత్రాలుండేవని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు 33 అడుగుల వెడల్పుతో దాదాపు 20 కిలోమీటర్ల పొడవు ఉన్నట్లు ఆధారాలున్నాయి. కనీసం 10000 నుంచి 30000 మంది ఇక్కడ నివసించేవారని ఆంటోనే డోరిసన్ అనే శాస్త్రవేత్త అంచనా వేశారు. ఈ పురాతన నగరంలో మొత్తం ఐదు సెటిల్మెంట్లు ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇళ్లను చెక్కతో నిర్మించారని తెలిపారు. వీటిలో నిప్పు ఉంచడానికి ప్రత్యేక ప్రదేశాలు, రంధ్రాలను గుర్తించారు. 1000 ఏళ్ల క్రితం ఈ నగరం అదృశ్యమైనట్లు భావిస్తున్నారు.