Japan Earthquake: జపాన్లో న్యూ ఇయర్ రోజు భయంకరమైన భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల తర్వాత 90 ఏళ్ల వృద్ధురాలిని శిథిలాల నుండి బయటకు తీశారు. పశ్చిమ జపాన్లో కూలిన ఇంటి నుంచి 90 ఏళ్ల వృద్ధురాలిని సజీవంగా బయటపడింది. భూకంపం సంభవించిన 124 గంటల తర్వాత మహిళను రక్షించారు. ఈ భూకంపంలో 126 మంది మరణించారు. చనిపోయిన వారిలో ఐదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. భూకంపం వచ్చినప్పుడు వేడినీటిలో పడిపోయిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఎక్కువ మరణాలు ఎక్కడ సంభవించాయి?
జనవరి 1న సంభవించిన భూకంపంలో అత్యధిక మరణాలు వాజిమా నగరంలో సంభవించాయి. భూకంపం తర్వాత ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. జపాన్ సైనికులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. సుమారు ముప్పై వేల మందికి నీరు, ఆహారం, మందులు, ఇతర సౌకర్యాలు కల్పించారు.
ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారా?
భూకంపం తర్వాత నివాస ప్రాంతాలను బాగు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదని జపాన్ ప్రజలు వాపోతున్నారు. సెర్చ్ ఆపరేషన్ పూర్తయిన శిథిలాలను అలాగే వదిలేశామని చెప్పారు. శిథిలాల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులు మూసుకుపోయాయి. ఈ ప్రాంతంలో 100 కంటే ఎక్కువ కొండచరియలు విరిగిపడటాన్ని గుర్తించిందని.. కొన్ని ప్రధాన రహదారులు మూసుకు పోయాయని ఖతారీ వార్తా ఛానెల్ పేర్కొంది. సునామీ బారిన పడిన షిరోమారు తీరప్రాంత సమాజం వంటి కొన్ని సంఘాలు ఇప్పటికీ సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి.