ప్రముఖ సైనికాధికారి జనరల్ ఖాసీం సులేమాని స్మారక కార్యక్రమం జరుగుతుండగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు బాంబుల మోత మోగించారు. ఈ పేలుడులో వందల సంఖ్యలో మరణించారు.
Iran: ఇరాన్‌కి చెందిన ప్రముఖ సైనికాధికారి జనరల్ ఖాసీం సులేమాని స్మారక కార్యక్రమం నిన్న జరిగింది. ఈ కార్యక్రమం జరుగుతున్న వేళ నిమిషాల వ్యవధిలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు బాంబుల మోత మోగించారు. ఈ పేలుళ్లలో 103 మంది మరణించగా.. 188 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద లేదా ఇతర సంస్థ తెలపలేదు. సులేమాని నాలుగో వర్ధంతి సందర్భంగా కెర్మాన్ పట్టణంలోని శ్మశానంలో ఉన్న ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు వందలాది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. 20 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు బాంబుల మోత మోగింది. మొదటి పేలుడు కంటే రెండో పేలుడులో ఎక్కువమంది గాయపడటంతో పాటు మరణించారు.
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌లోని అత్యంత శక్తివంతమైన ఖుద్స్ ఫోర్స్‌కు నాయకత్వం వహించిన ఖాసీం సులేమాని అమెరికా డ్రోన్ దాడిలో 2020 జనవరి 3న మరణించాడు. అప్పడు ఇరాన్ సైనిక కార్యకలాపాల రూపకర్తగా సులేమాని పేరుపొందాడు. 2003లో ఇరాక్‌పై అమెరికా దాడి వరకు బయట ప్రపంచానికి సులేమాని తెలియదు. దశాబ్దన్నర కాలంలో సులేమాన్ ఇరాన్ గొప్ప యుద్ధభూమి కమాండర్‌గా గుర్తింపు పొందాడు.