»Donald Trump Trump Who Asked The Supreme Court Because
Donald Trump: సుప్రీంకోర్టును కోరిన ట్రంప్.. ఎందుకంటే?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ క్యాపిట్ దాడి విషయంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండోసారి పదవిని కైవసం చేసుకోవాలనుకునే ట్రంప్‌కి కొలరాడో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ క్యాపిట్ దాడి విషయంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండోసారి పదవిని కైవసం చేసుకోవాలనుకునే ట్రంప్‌కి కొలరాడో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయడానికి ట్రంప్ అనర్హుడని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీనిని రద్దు చేయాలని కోరుతూ యూఎస్ సుప్రీంకోర్టులో ట్రంప్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కొలరాడో కోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి అనుమతించినట్లయితే అధ్యక్ష పదవి రేసులో ముందంజలో ఉన్న అభ్యర్థికి ప్రజలు ఓట్లేయకుండా చేసినట్లవుతుంది.
కొలరాడో కోర్టు తీర్పు వెలువడి 10 రోజులు కాకముందే మైన్ రాష్ట్రం కూడా ఆయనకు షాక్ ఇచ్చింది. ఈక్రమంలో కొలరాడో సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మైన్ రాష్ట్రంలో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని కొందరు సవాలు చేశారు. వారి అప్పీళ్లను పరిగణనలోకి తీసుకున్న ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి షెన్నా బెల్లోస్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్లు గతవారం ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్ అనర్హుడని కొలరాడో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.