టెస్లా అధినేత ఎలన్ మస్క్ డ్రగ్స్ తీసుకున్నారంటూ పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో స్వయంగా ఆయనే స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
Elon Musk: టెస్లా అధినేత ఎలన్ మస్క్(Elon Musk) డ్రగ్స్(drugs) తీసుకున్నారంటూ వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. గత మూడేళ్లుగా పరీక్షలు చేయించుకుంటున్ననని, ఇప్పటి వరకు ఎలాంటి డ్రగ్స్, మద్యం ఆనవాళ్లు తన శరీరంలో లేవని వెల్లడించారు. ఇది విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆయన ఎదుగుదలను చూడలేక చాలా మంది ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మాములుగానే మస్క్ అనేక పార్టీలకు అటెండ్ అవుతుంటారు. దాంతో ఆయన డ్రగ్స్ తీసుకున్నారంటూ అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా దాన్ని ప్రచురించాయి. ఈ విషయంపై టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా ఈ కథనాన్ని మస్క్ ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేస్తూ.. ‘‘గతంలో రోగన్తో ఒకసారి గంజాయి సేవించానని తెలిపారు. ఆ తరువాత వాటిని టచ్ చేయలేదని పేర్కొన్నారు. నాసా అభ్యర్థన మేరకు మూడేళ్లుగా పరీక్షలు చేయించుకుంటున్నా. ఇప్పటి వరకు నా శరీరంలో డ్రగ్స్, మద్యానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు గుర్తించలేదు’’ అని ట్వీట్లో తెలిపారు.