»Plane Crash Hollywood Actor With Daughters Dies In Plane Crash
Plane Crash: విమాన ప్రమాదంలో కుమార్తెలతో హాలీవుడ్ నటుడు దుర్మరణం
ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ అతని ఇద్దరు కూతుళ్లు విమాన ప్రమాదంలో మరణించారు. ఒలివర్ తన కుటుంబంతో కలిసి గ్రెనడైన్స్‌లోని బెక్వియా ద్వీపం నుంచి సెయింట్ లూసియాకు వెళ్తున్నారు. ఆ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
Plane Crash: ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ అతని ఇద్దరు కూతుళ్లు విమాన ప్రమాదంలో మరణించారు. ఒలివర్ తన కుటుంబంతో కలిసి వెకేషన్‌కి వెళ్లారు. గ్రెనడైన్స్‌లోని బెక్వియా ద్వీపం నుంచి సెయింట్ లూసియాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బెక్వియాలో టేకాఫ్ అయిన కొద్ది సమయానికే విమానం కరీబియన్ సముద్రంలో కుప్పకూలింది. దీంతో ఒలివర్‌తో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు మడిత, అన్నీక్ కూడా మరణించారు. ఈ ప్రమాదంలో పైలట్ కూడా మరణించారు. విషయం తెలుసుకున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది మత్స్యకారులతో కలిసి మృతదేహాలను వెలికితీశారు.
జర్మనీలో జన్మించని క్రిస్టియన్ ఒలివర్ వయస్సు 51 సంవత్సరాలు. ఇద్దరు కుమార్తెలు అన్నిక్(12), మదితా(10)తో కలిసి ప్రైవేట్ వాహనంలో వెళ్తున్న సమయంలో నిన్న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒలివర్ హాలీవుడ్‌తో పాటు జర్మనీలో పలు టీవీ సీరిస్‌ల్లో నటించారు. కోబ్రా 11 సిరీస్‌తో మంచి పేరు సొంతం చేసుకున్నారు. ది గుడ్ జర్మన్, స్పీడ్ రేసర్ సహా మొత్తం 60 సినిమాల్లో ప్రేక్షకులను అలరించారు.