ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదంటే డ్రాగన్ కంట్రీ చైనా అని తడుముకోకుండా చెబుతాం. ఇక్కడ జనాభా ఎప్పటికప్పుడు వేగంగా పెరుగుతోంది. అయితే 2022 క్యాలెండర్ ఏడాదిలో మాత్రం తగ్గుముఖం పట్టింది. ఆరు దశాబ్దాల తర్వాత మొదటిసారి చైనాలో జనాభాలో క్షీణత నమోదు కావడం గమనార్హం. 2021 కంటే 2022లో జనాభా ఎనిమిదిన్నర లక్షల మేర తగ్గింది. జనాభా తగ్గడానికి కరోనా మహమ్మారి సహా వివిధ కారణాలు ఉన్నాయి. చైనాలో చివరిసారి 1...
పాకిస్తాన్ తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. వరదలతో ఆహార ఉత్పత్తి తగ్గడం, విదేశీ నిల్వలు లేక దిగుమతులు ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. పరిస్థితి ఏ స్థాయికి చేరుకున్నదంటే గోధుమపిండి కోసం కూడా తొక్కిసలాట జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ (PTI) అధికార షెహబాజ్ షరీఫ్ పైన విమర్శలు గుప్పిస్తోంది. అంతేకాదు, గతంలో ప్రధాని మోడీ ...
నేపాల్‌లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మాండ్ నుండి కాస్కి జిల్లాలోని పోఖరాకు వెళ్తున్న యెతి ఎయిర్ లైన్స్ ప్లేన్ కుప్పకూలింది. ఈ విమానం బయలుదేరిన 20 నిమిషాలకు కుప్పకూలింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 25 నిమిషాలు. మరో 5 నిమిషాలు ప్రయాణిస్తే విమానం గమ్యస్థానం చేరుకునేది. ప్రమాదం సమయంలో 72 మంది ప్రయాణీకులు, సిబ్బంది ఉన్నారు. ఇందులో ఐదుగురు భారతీయులు సహా 10 మంది విదేశీయులు. ఈ ఘట...
మిస్ యూనివర్స్ కిరీటాన్ని అమెరికాకు చెందిన 28 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ ఆర్‌బెన్నీ గాబ్రియెల్ దక్కించుకున్నారు. గత ఏడాది ఈ టైటిల్ పొందిన భారత హర్నాజ్ సంధు కిరీటాన్ని ఆమెకు అలంకరించారు. మిస్ యూనివర్స్ టాప్ 16 జాబితాలో చోటు దక్కించుకున్నారు భారత దివితా రాయ్. టాప్ 5లో కూడా నిలువలేకపోయారు. అమెరికాలోని న్యూఆర్లియాన్స్‌లో మిస్ యూనివర్స్ 71వ ఎడిషన్ ఫైనల్‌లో వివిధ దేశాలకు చెందిన 80 మంది పోటీ పడ్డారు. ఈ అందా...
చైనాలో కరోనా విజృంభిస్తోంది. డ్రాగన్ దేశంలో కేసులు 900 మిలియన్లకు చేరుకున్నాయి. మరో రెండు మూడు నెలల వరకు గరిష్టస్థాయిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని, వైద్య సదుపాయాల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటే, మరోవైపు చైనా ప్రజలు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు. కోట్లాదిమంది ప్రజలు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారని, అప్...
టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ తన వేతాన్ని తగ్గించుకోవడానికి స్వచ్చంధంగా ముందుకు వచ్చారు. 40 శాతం వేతనం తగ్గించుకోనున్నారు. మార్చి 10వ తేదీన జరగనున్న ఇన్వెస్టర్ డేలో షేర్ హోల్డర్స్ అనుమతి లభించవలసి ఉంది. ఇప్పటికే షేర్ హోల్డర్లకు పంపిణ ప్రతిపాదనలలో కుక్ వేతన కోత అంశాన్ని చేర్చారు. టిమ్ కుక్ ఏడాదికి 99 మిలియన్ డాలర్ల వేతనం అందుకుంటున్నారు. 2023లో 49 మిలియన్ డాలర్లకు తగ్గించాలని నిర్ణయించారు....
భారత్, న్యూజిలాండ్ ల మధ్య తొలివన్డేకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18వ తేదీ నుంచి హైదరాబాద్ వేదికగా.. ఈ వన్డే సిరీస్ జరగనుంది. కాగా… ఈ మ్యాచ్ టికెట్లను శుక్రవారం నుంచి ఆన్ లైన్ లో విక్రయించనున్నారు. గత సెప్టెంబరులో భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టిక్కెట్ల విక్రయం సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షు...
భారత్ లో తయారు చేసిన దగ్గుమందు తీసుకొని ఉజ్బెకిస్థాన్‌లోని కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఈ ఘటన నేపథ్యంలో మనదేశంలో తయారు చేస్తున్న రెండు రకాల దగ్గుమందులపై నిషేధం విధిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను ఉజ్బెకిస్థాన్‌లోని పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫారసు చేసిం...
బ్రిటన్ ప్రధానమంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునక్‌కు 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో రిషి ఆ పదవిని చేపట్టారు. అయితే తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో రిషి సునక్‌తో పాటు 15మంది మంత్రులు గెలిచే అవకాశాలు లేవని వెల్లడైంది. ఇందులో ఉప ప్రధాని డొమినిక్ రాబ్ కూడా ఉన్నారు. బ్రిటిష్ సాధారణ ఎన్నికలు 2025 జనవరి 25వ తేదీ నాటిక...
కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని వదిలేలా లేదు. ప్రతి సంవత్సరం తగ్గినట్లే తగ్గి.. మళ్లీ విజృంభిస్తూనే ఉంది. ఈ వైరస్ కి పుట్టినిల్లు అయిన చైనాలో మరింతగా వ్యాపిస్తోంది. అక్కడ మళ్లీ వేలల్లో కేసులు నమోదౌతున్నాయి. కోవిడ్ లక్షణాలతో హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. కాగా… అక్కడ పలువురు సెలబ్రెటీలు సైతం ప్రాణాలు కోల్పోయినట్లు తాజా సమాచారం. చాలా మంది సెలబ్రెటీలుు ఈ కోవిడ్ క...
అగ్రరాజ్యం వీసా మరింత ప్రియం కానుంది. ఇమ్మిగ్రేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజును భారీగా పెంచుతూ జోబైడెన్ సర్కార్ ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలు రూపు దాలిస్తే హెచ్1బీ, హెచ్2బీ, ఎల్1, ఓ1, ఈబీ5 ఛార్జీలు అమాంతం పెరుగుతాయి. అయితే ఇందులో ఎక్కువగా తమ ఉద్యోగులను అమెరికాకు పంపించే కంపెనీలు భరించేవే. ఈబీ5 వీసా అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారికి ఇస్తారు. వలసేతర, ఉద్యోగ ఆధారిత వీసా దరఖాస్తుల ఛార్జీలను భారీగ...
డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ప్రయాణీకులకు కోవిడ్ కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకు వస్తోంది. కరోనా వైరస్ BF7 చైనాలో కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఒక వేరియంట్ కాదని, నాలుగు వైరస్ వేరియంట్స్ కారణంగా చైనా కరోనాతో అతలాకుతలమవుతోందని వెల్లడైంది. చైనా అధికారిక డేటా ప్రకారం ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, తాజాగా 5231 కేసులు వెలుగు చూశా...
ఫుట్ బాల్ లెజెండరీ ప్లేయర్ మెస్సీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మెస్సీకి ఇప్పుడు అభిమానులు ఉన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా మెస్సీని విపరీతంగా అభిమానిస్తాడు. ధోనీ కుమార్తె జీవా ధోనీ కూడా మెస్సీ అభిమానిగా మారింది. చిన్న వయసులోనే తండ్రిలాడే ఫుట్‌బాల్ క్రీడను బాగా ఎంజాయ్ చేస్తోంద...
ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. కాస్త తగ్గుముఖం పట్టిందనుకునేలోపు.. బీఎఫ్7 రూపంలో కొత్త వేరియంట్ కలకలం రేపడం మొదలుపెట్టింది. దీనికే ప్రజలు భయపడుతుంటే… తాజాగా కొత్తరకం మరో వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇది మరింత ప్రమాదకారిగా తెలుస్తోంది. మెదడు తినే అమీబా ఒకటి కొత్తగా పుట్టుకు వచ్చింది. దీని కారణంగా దక్షిణ క...
భారత్ జీ20 సదస్సుకు హోస్ట్‌గా వ్యవహరిస్తోందని, ఇలాంటి సమయంలో భారత్ తన శాంతి ఫార్ములాను ముందుకు తీసుకు వెళ్లాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ సంభాషణ సందర్భంగా సూచించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో జీ20 సదస్సు జరగనుంది. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా, జెలెన్‌స్కీ… మోడీతో ఫోన్‌లో సంభాషించారు. అనంతరం ఆయన ఫోన్ ద్వారా మ...