చైనాలో కరోనా విజృంభిస్తోంది. డ్రాగన్ దేశంలో కేసులు 900 మిలియన్లకు చేరుకున్నాయి. మరో రెండు మూడు నెలల వరకు గరిష్టస్థాయిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని, వైద్య సదుపాయాల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటే, మరోవైపు చైనా ప్రజలు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు. కోట్లాదిమంది ప్రజలు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారని, అప్పుడు మహమ్మారి గ్రామాలకు విస్తరిస్తుందని హెచ్చరించారు.
కరోనాకు ముందు వరకు ఈ గ్రేట్ మైగ్రేషన్ కొనసాగింది. వైరస్ ఆంక్షల నేపథ్యంలో 2020 నుండి ప్రయాణాలు లేవు. రెండు నెలల క్రితం చైనా జీరో కోవిడ్ విధానాన్ని తీసుకు రావడంతో భారీస్థాయిలో రాకపోకలు కనిపించాయి. చైనా జనాభాలో మూడొంతుల కంటే ఎక్కువమంది కరోనా గరిష్టస్థాయికి చేరుకున్న ప్రాంతంలో ఉన్నారు. ఇది కూడా ఆందోళన కలిగించే అంశం. కరోనాకు సంబంధించి చైనా పారదర్శకంగా లేదనే అనుమానాలు మొదటి నుండి ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు స్మశాన వాటికల వద్ద శవాల వరుస కనిపిస్తుంటే, అక్కడి ప్రభుత్వం మాత్రం స్వల్ప మరణాలను నివేదిస్తోంది.