»Indian National Stabs Cleaner At Rail Station In Sydney Shot Dead By Australian Police
Indian national shot dead: భారతీయుడ్ని కాల్చేసిన ఆస్ట్రేలియా పోలీసులు… ఎందుకంటే
భారత్ కు (Indian) చెందిన ఓ వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు (Australian police) మంగళవారం కాల్చి చంపారు. అతను బ్రిడ్జింగ్ వీసా పైన ఆస్ట్రేలియాలో (Australia) ఉంటున్నాడు.
భారత్ కు (Indian) చెందిన ఓ వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు (Australian police) మంగళవారం కాల్చి చంపారు. అతను బ్రిడ్జింగ్ వీసా పైన ఆస్ట్రేలియాలో (Australia) ఉంటున్నాడు. మృతి చెందిన వ్యక్తిని తమిళనాడుకు (Tamil Nadu) చెందిన 32 ఏళ్ల మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ గా (Mohamed Rahmathullah Syed Ahmed) గుర్తించారు. అతను సిడ్నీ రైల్వే స్టేషన్ లో (Sydney railway station) ఓ క్లీనర్ ను కత్తితో పొడవడంతో పాటు పోలీసులను బెదిరించాడు. దీంతో అతనిని కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ఆస్ట్రేలియాలోని భారత ఎంబసీ స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని విచారం వ్యక్తం చేసింది. తమిళనాడుకు చెందిన అహ్మద్ బ్రిడ్జింగ్ వీసా పైన ఔబర్న్ లో ఉంటున్నట్లు తెలిపింది.
సిడ్నీ వెస్ట్ ఔబర్న్ రైల్వే స్టేషన్ లో 28 ఏళ్ల క్లీనర్ పైన కత్తితో దాడి చేశాడని, ఆ తర్వాత అడ్డుకున్న పోలీసులను కత్తితో బెదిరించాడని చెప్పారు. ఇద్దరు పోలీసులు స్టేషన్ నుండి బయటకు వెళ్తున్న క్రమంలో వారిని బెదిరించడంతో పాటు దాడికి యత్నించాడు. ఆ తర్వాత ఐదు నిమిషాలకు అతనిని పోలీసులు కాల్చేశారు. పోలీసు అధికారి అతని పైన మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. రెండు రౌండ్లు ఛాతిలోకి వెళ్లాయి. వెంటనే అతనిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. పోలీసులకు కాల్చడం మినహా మరో మార్గం లేకుండా పోయిందని న్యూసౌత్ వేల్స్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ స్టువార్ట్ స్మిత్ తెలిపారు. ‘ఇది బాధాకరమైన అంశమే. కానీ పోలీసులకు తాను అండగా ఉంటాను. మా పోలీస్ స్టేషన్ లో ఇది ముఖ్యమైన ఘటన. కానీ వారికి కాల్చడం మినహా మరో అవకాశం లేకుండా పోయింది’ అని చెప్పాడు. మరోవైపు అహ్మద్ దాడి చేసిన క్లీనర్ ను హాస్పిటల్ లో చేర్పించినట్లు చెప్పారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.