Samshabad : శంషాబాద్ లో ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 66.47 లక్షల విలువ చేసే 1.40 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు తెలిపారు.
శంషాబాద్ లో ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 66.47 లక్షల విలువ చేసే 1.40 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు తెలిపారు. తున చేప ఆయిల్ డబ్బాల్లో బంగారు తీసుకొచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.
ముందస్తు సమాచారంతో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద ఈ తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజామున 2.55 గంటలకు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.52.24 లక్షల విలువ చేసే 840 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈరోజు తెల్లవారుజామున 3.45గంటలకు వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి రూ.14.23 లక్షల విలువైన 233 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. మొదటి ప్రయాణికుడు ముద్ద రూపంలో బంగారాన్ని తీసుకురాగా.. రెండో ప్రయాణికుడు తున చేప ఆయిల్ డబ్బాల మధ్య దాచుకుని తెచ్చినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.