ముగ్గురు వ్యక్తుల DNA ను కలిపి శిశువులకు జన్మనిచ్చారు. ఈ ఘటన బ్రిటన్ (UK)లో జరిగింది. మైట్రోకాన్డ్రియాల్ వ్యాధులతో పిల్లలు పుట్టకుండా నిరోధించే ప్రక్రియలో భాగంగానే ఈ ప్రయత్నాన్ని చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రక్రియలో 99.8 శాతం DNAను ఇద్దరు తల్లిదండ్రుల నుంచి తీసుకున్నట్లు చెప్పారు. మైటోకాన్డ్రియాల్ డొనేషన్ ట్రీట్మెంట్ (Mitochondrial Donation Treatment) (MDT)గా పిలవబడే ఈ సాంకేతికత పద్దతి… ఆరోగ్యవంతమైన మహిళా దాతల ద్వారా గుడ్లను తీసుకుని అందులో నుంచి కణజాలాన్ని ఉపయోగించి IVF పిండాలను సృష్టిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా, మైటోకాన్డ్రియల్ వ్యాధులు అడ్డుకునేందుకు ప్రయోగాలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. నయం చేయలేనివి మరియు పుట్టిన కొన్ని రోజులలో లేదా కొన్ని గంటల్లోనే ప్రాణాంతకం అయ్యే రోగాలను నయం చేయడంతోపాటు అసలు రాకుండా ఉండేందుకు ప్రయోగాలు జరుగుతున్నట్లు చెప్పారు. దాత పిండాలను తల్లి ద్వారా మాత్రమే పంపబడతాయి చెప్పారు. కాబట్టి మైటోకాన్డ్రియల్ చికిత్స అనేది ఆరోగ్యకరమైన దాత గుడ్డు నుంచి మైటోకాండ్రియాను ఉపయోగించే IVF యొక్క సవరించిన రూపం అని అన్నారు.
శిశువు తన తల్లి, తండ్రి నుంచి న్యూక్లియర్ DNA ను కలిగి ఉంటుంది, ఇది వ్యక్తిత్వం మరియు కంటి రంగు వంటి ముఖ్య లక్షణాలను ఇస్తుంది. దీంతోపాటు.. మహిళా దాత అందించిన మైటోకాన్డ్రియల్ DNA యొక్క చిన్న మొత్తాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు ప్రక్రియల వలన పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుందని భవిష్యత్తులో ఎలాంటి రోగాలు రావని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇంగ్లండ్‌లోని ఈశాన్య ప్రాంతంలోని న్యూకాజిల్‌లోని క్లినిక్‌లో ఐదుగురు పిల్లలు పుట్టినట్లు తెలిపారు. అయితే వారి వివరాలను బయటకు వెళ్లడించలేదు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో (University of Oxford) పునరుత్పత్తి జన్యుశాస్త్ర ప్రొఫెసర్ డాగన్ వెల్స్ ది గార్డియన్‌తో మాట్లాడుతూ MRTతో క్లినికల్ అనుభవం ”ప్రోత్సాహకరంగా” ఉంది కానీ నివేదించబడిన కేసుల సంఖ్య ”చాలా తక్కువ” అని చెప్పారు. MDT నుండి శిశువులను సృష్టించిన మొదటి దేశం UK కాదు. 2016లో USలో చికిత్స పొందుతున్న జోర్డానియన్ కుటుంబానికి ఈ టెక్నిక్ ద్వారా జన్మించిన మొదటి శిశువుగా గుర్తించబడ్డాడు.