»Elon Musks Star Link Experiment Has More Disadvantages Than Benefits
Star Link: స్టార్ లింక్ ప్రయోగం… ఉపయోగాల కన్నా నష్టాలే ఎక్కువ
ప్రపంచానికి స్పీడ్ ఇంటర్ నెట్ అందించాలని స్పేస్ ఎక్స్ చేపట్టిన స్టార్ లింక్ ప్రయోగంతో లాభాల కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నట్టు ఓ పరిశోధనలో తేలింది. స్టార్ లింక్ మూలంగా భవిష్యత్తులో ఇతర ప్రయోగాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుందని పేర్కొంది.
Elon Musk's Star Link experiment... has more disadvantages than benefits
కుగ్రామాలకు ఇంటర్నెట్ అందించడానికి ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రతిష్టాత్మకంగా చెపట్టిన ప్రయోగం స్టార్ లింక్ (Star Link). దీంతో నష్టాలే ఎక్కువగా ఉన్నాయని కొందరు పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. ఎలాన్ మస్క్ (Elon Musk) చేస్తున్న ప్రయోగంలో స్పేస్ ఎక్స్ చాలా విశిష్టమైంది. అందులో స్టార్ లింక్ ఒకటి. ఇంటర్నెట్ వేగం పెంచడంలో భాగంగా 55 దేశాలకు స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. ప్రపంచంలో మిగతా అన్ని దేశాలకు ఇదే స్పీడ్‌తో నెట్ అందించే ఎక్స్ పరిమెంట్లో లోపాలు ఉన్నట్టు తెలుస్తుంది.
స్టార్ లింక్ నుంచి వెలువడే రేడియేషన్.. అంతరిక్షంలో పరిశోధనకు ఉపయోగించే రేడియో సిగ్నల్స్‌కు అంతరాయం కలిగిస్తోందని అస్ట్రానమీ, అస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం (Study) పేర్కొంది. స్టార్‌లింక్ శాటిలైట్లలో ఉన్న ఎలక్ట్రానిక్స్ విడి భాగాలు తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియో వేవ్స్‌ను వెలువరిస్తున్నాయని ఇటీవల పరిశోధకులు గుర్తించారు. స్టార్‌లింక్‌కు కేటాయించిన బ్యాండ్ విడ్త్ కంటే ఇవి ఎంతో వేరుగా ఉన్నాయని ఆ ఆధ్యయనంలో పేర్కొంది.
ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్‌కు చెందిన ఫెడెరికో డి వ్రునో తెలిపిన వివరాల ప్రకారం.. భవిష్యత్‌లో స్టార్ లింక్ ఉపగ్రహాలు వెలవరించే రేడియేషన్ వల్ల అంతరిక్షంలో ఇతర ఉపగ్రహాలపై ప్రభావం పడుతుందని, స్పేస్‌లో రేడియేషన్ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. లో ఫ్రీక్వెన్సీ అరే టెలిస్కోప్‌ను శాస్త్రవేత్తలు ఉపయోగించారు. దీనితో 68 స్టార్‌లింక్ శాటిలైట్లను పరిశీలించగా 47 శాటిలైట్లు రేడియేషన్‌ను వెలువరిస్తున్నట్లు గుర్తించారు. అవాంఛిత రేడియో సిగ్నల్ లీకేజీను అరికట్టేందుకు పరిశోధనలు చేస్తున్నామని, త్వరలో పరిష్కారం కనుగొంటామని స్పేస్ ఎక్స్ చెబుతోంది.
అన్ని దేశాలకు స్పీడ్ ఇంటర్నెట్ అందించే ప్రయోగంలో భాగంగా స్పెస్ ఎక్స్ 42 వేల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించనుంది. ఇప్పటివరకు 4 వేల ఉపగ్రహాలను పంపించగా అవి 55 దేశాల్లో సేవలను అందిస్తున్నాయి.