రువాండ రాజధాని కిగాలీ(Kigali)లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.వేశ్యలను ఇంటికి పిలిపించుకుంటున్న 34 ఏళ్ల ఓ కిల్లర్.. వారిని అతి కిరాతకంగా చంపేస్తున్నాడు. అనంతరం వారి దగ్గర ఉన్న డబ్బు (Money), వస్తువులను దోచుకుని తన ఇంట్లోని కిచెన్‌లో మృతదేహాలను పాతిపెడుతున్నాడు. తాజాగా ఈ సైకో కిల్లర్‌ను పోలీసులు (Police) అరెస్ట్ చేయగా.. ఘోరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.వేశ్యలను ఇంటికి పిలిపించుకుంటాడు. వారిని దారుణంగా హింసించి చంపేస్తాడు. ఆ తర్వాత వారి దగ్గర ఉన్న ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను దోపిడీ చేస్తాడు. చంపేసిన తర్వాత మహిళ(woman)ల మృతదేహాలను కిచెన్‌లో గొయ్యి తీసి పూడ్చివేస్తున్నాడు.
భయాందోళనకు గురి చేస్తున్న ఓ సీరియల్ కిల్లర్ (Killer) గుట్టు రట్టు అయింది. ఇప్పటివరకు ఈ సైకో కిల్లర్ 14 మంది మహిళలను చంపేసినట్లు పోలీసులు గుర్తించారు. కిచెన్‌లో 10 మృతదేహాల(dead bodies)ను వెలికితీశారు. మిగతావారి మృతదేహాలను యాసిడ్ పోసి కరిగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సైకో కిల్లర్ ఘటన బయటకు రావడంతో స్థానికులు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిందితుడి (accused) ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.