»Ripmarimuthu Tragedy In Tamil Industry Jailer Actor Mari Muthu Died Of Heart Attack
RIPMarimuthu: ఇండస్ట్రిలో విషాదం.. జైలర్ నటుడు మృతి
తమిళ ఇండస్ట్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి. జైలర్ చిత్రంలో ప్రేక్షకులను అలరించిన నటుడు మారి ముత్తు మరణించడం సినిమా పరిశ్రమకు తీరని లోటు. తక్కువ వయసులోనే గుండెపోటుతో మరణించడం సినిమా అభిమానులను కలవరపెడుతుంది.
RIPMarimuthu Tragedy in Tamil industry Jailer actor Mari Muthu died of heart attack
RIPMarimuthu: సినీ ఇండస్ట్రీ(Movie Industry)లో వరుస విషాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా(Corona) తరువాత పరిశ్రమలోనే కాదు సామాన్య ప్రజలు కూడా హఠత్తుగా మృతి చెందుతున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. తమిళ ఇండస్ట్రీలో(Kollywood) తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్ మారిముత్తు(Marimuthu) ఉదయం గుండెపోటుతో ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేశారు.
ఈరోజు ఉదయం మారి ముత్తు ఓ సీరియల్ కి డబ్బింగ్ చెప్పే సమయంలో ఆయనకి ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని సన్నిహితులు తెలిపారు. 57 ఏళ్ల వయసులోనే మారిముత్తుకు గుండెపోటు రావడం పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ మధ్యే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటించారు. చిత్రంలో విలన్ కు నమ్మకస్తుడిగా ఉండే పన్నీరు పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఇప్పటివరకు సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో మెప్పించారు. ఈ మధ్యే హే ఇందమ్మ అనే పద్యం విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఇండస్ట్రీలో మొదట సహాయ దర్శకుడిగా తన జర్నీని స్టార్ట్ చేసి తర్వాత నటుడిగా మారారు. 1999లో అజిత్ నటించిన వాలి సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేశారు మారి ముత్తు. 2008లో కన్నుమ్ కన్నుమ్ అనే సినిమాకు దర్శకత్వం చేశారు. దీనికి ముందు మణిరత్నం, వసంత సీమన్, SJ సూర్య లాంటి దర్శకుల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు.
సినిమాల్లోనే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. సన్ టీవీలో యాంటీ స్విమ్మింగ్ అనే సీరియల్ లో నటించి టీవీ రంగంలో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మరణ వార్త తమిళ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. అయితే సెప్టెంబర్ 2 న ప్రముఖ తమిళ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ఆర్.ఎస్ శివాజీ మృతి చెందిన విషయం తెలిసిందే.