Lady ఖాకీపై సీఐ కన్ను.. భర్త లేని సమయంలో ఇంటికొచ్చి, ఏమైందంటే..?
కానిస్టేబుల్‌పై మోజుతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు సీఐ ఇఫ్తికర్. శకుంతలను వేధించడంతో ఆమె భర్త కానిస్టేబుల్ జగదీశ్ దాడి చేశాడు. తీవ్రగాయాలతో సీఐ ఆస్పత్రిలో చనిపోయాడు.
CI Iftikar Ahmed: ఇటీవల పాలమూరు సీసీఎస్ సీఐ ఇఫ్తికార్ అహ్మద్ (Iftikar Ahmed) చనిపోయాడు. అతని మృతిపై అనుమానం రావడంతో విచారణ జరపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లేడీ కానిస్టేబుల్‌పై మోజు అతని ప్రాణం తీసింది. ఇదే విషయాన్ని విచారణ అధికారులు చెబుతున్నారు.
ఏం జరిగిందంటే..?
మహబూబ్ నగర్ వన్ టౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే జగదీశ్.. ఎస్పీ కార్యాలయంలో గల గ్రీవెన్స్ సెల్లో పనిచేసే కానిస్టేబుల్ శకుంతల ఒకరికొకరు తెలుసు.. డిపార్ట్ మెంట్లోనే ఇద్దరూ ఉండటంతో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితం సజావుగా సాగుతోంది. 2018లో వీరి జీవితంలోకి సీఐ ఇఫ్తికార్ అహ్మద్ ఎంట్రీ ఇచ్చాడు. శకుంతలతో పరిచయం ఏర్పడింది. తర్వాత ట్రాన్స్ ఫర్ కాగా.. ఆ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు.
వేధింపులు స్టార్ట్
అలా వెళ్లిన ఇఫ్తికర్ మళ్లీ గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన మహబూబ్ నగర్ వచ్చాడు. అప్పటి నుంచి శకుంతలకు మెసేజ్ చేయడం ప్రారంభించాడు. విషయం శకుంతల భర్తకు చెప్పగా.. ఇద్దరు కలిసి ఇఫ్తికర్ మంచిగా చెప్పారు. అయినప్పటికీ వినిపించుకోలేదు. ఈ నెల 1వ తేదీన రాత్రి ఇంటికి వస్తానని మెసేజ్ చేశాడు. భర్త ఇంట్లో ఉన్నాడని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు.
రాత్రి 11.20 గంటలు
రాత్రి 11.20 గంటలకు మర్లు సమీపంలో గల ఎస్ఆర్ నగర్‌కు కారులో వచ్చాడు. ఇంటి సమీపంలో కారు ఆపి ఇంటి డోర్ కొట్టాడు. డోర్ తీసి మాట్లాడుతుంది. ఇఫ్తికర్ రావడాన్ని చూసిన జగదీశ్ స్నేహితుడు కృష్ణ అతనికి ఫోన్ చేశాడు. వెంటనే ఇంటికి వచ్చిన జగదీశ్.. భార్యతో మాట్లాడుతున్న సీఐపై కృష్ణతో కలిసి దాడి చేశాడు. తప్పించుకుని పరుగెత్తుతూ రోడ్డుపైకి వచ్చాడు. అక్కడ మరోసారి దాడి చేయడంతో ఇఫ్తికర్ సృహ కోల్పోయాడు. కారు వెనక సీట్లో ఎక్కించారు.
ఫోటో షేర్..
కొంతదూరం కారు తీసుకెళ్లి వదిలేశాడు. వెంటనే పీఎస్‌కు చేరుకుని.. ఏఎస్ఐతో ఫోటో దిగి.. గ్రూపులో షేర్ చేశాడు. తెల్లవారుజామున 3.36 గంటలకు కారు వద్దకు వెళ్లి సీఐని బయటకు దింపి రాయితో కొట్టాడు. కత్తితో పొడిచాడు. డ్రైనేజీలో కత్తి పడేసి ఇంటికెళ్లి పోయాడు. రక్తపు మరకలు పడిన దుస్తులు శకుంతల కాల్చివేసింది. మరునాడు ఉదయం తన సోదరుడికి శకుంతల ఫోన్ చేసి చెప్పింది. పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరగా ఎస్పీ, సీఐకి ఫోన్ చేసింది. తర్వాత జగదీశ్ దంపతులు, కృష్ణ పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సీఐ మంగళవారం చనిపోయాడు. పరారీలో ఉన్న జగదీశ్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణ పరారీలో ఉన్నాడు.
ప్రాణం తీసిన మోజు
కానిస్టేబుల్‌పై మోజుతో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు సీఐ ఇఫ్తికర్. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇఫ్తికర్ గురించి ఉన్నతాధికారులకు చెబితే బాగుండేది.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని.. జీవితాన్ని నాశనం చేసుకున్నారు జగదీష్ దంపతులు.