79 Dead: గ్రీస్‌లో (Greece) బుధవారం ఓడ మునిగిపోయింది. 20-30 మీటర్ల గల ఓడలో 400 మంది వలస కార్మికులు వెళుతున్నారని తెలిసింది. టర్కీ నుంచి ఇటలీ (Italy) వయా గ్రీస్ ద్వారా కార్మికులు వెళుతుంటారు. అలా ఓడ నదిలో మునిగింది. పడవ ప్రయాణిస్తోన్న సమయంలో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. ఓవర్ లోడ్ కావడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో 79 మంది వరకు చనిపోగా.. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
లిబియాలో (libiya) గల టోబ్రుక్ వద్ద ఓడ ప్రమాదానికి గురయ్యింది. గ్రీస్ అధికారులు మాత్రం ఓడ ఎక్కడినుంచి బయల్దేరిందనే విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. మంగళవారం అర్ధరాత్రి ఆ పడవలో ఉన్న వారి నుంచి తమకు అలర్ట్ వచ్చిందని.. తర్వాత కాంటాక్ట్ లేదని వివరించింది. ఆ పడవలో ఉన్న సంఖ్యపై కూడా సందేహాలు ఉన్నాయి. 750 మంది వరకు ఉన్నారని కొన్ని కథనాలు రావడంతో నెటిజన్లు సస్పెక్ట్ చేస్తున్నారు. ఆ పడవలో ఎంతమంది ఉన్నారో తెలియదు.. 104 మందిని మాత్రం కాపాడామని గ్రీక్ అధికారులు తెలిపారు.
ఓడ ప్రమాదం విషాదం నింపింది. ఏడాదిలో ఈ స్థాయిలో యూరప్ ఖండంలో ప్రయాణికులు మృతి జరగలేదు. ఫిబ్రవరి నెలలో తుఫాన్ వల్ల ఇటలీ కాలబేరియన్ తీరంలో ఓడ ప్రమాదానికి గురి కాగా.. 96 మంది చనిపోయారు. వలస కార్మికుల ప్రాణాలను స్మగ్లర్లు ప్రమాదంలో పడేశారని గ్రీక్ మైగ్రేషన్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రభుత్వాలు కలిసి సహాయక చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషన్ సూచించింది.
“We are witnessing one of the biggest tragedies in the Mediterranean." A huge search-and-rescue operation off the coast of Greece continues after an overcrowded fishing boat carrying migrants capsized and sank. At least 79 died and many more are missing. https://t.co/l0rL01yxgA