ఒడిశాలో ఘోరప్రమాదం జరిగింది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడింది. దీంతో నలుగురు మరణించారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో పాటు మరో ఏడుగురు గల్లంతయ్యారు.
Mahanadi: ఒడిశాలో ఘోరప్రమాదం జరిగింది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడింది. దీంతో నలుగురు మరణించారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో పాటు మరో ఏడుగురు గల్లంతయ్యారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరగడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. మృతి చెందిన వారి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయా కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. అలాగే రక్షించిన వాళ్లకి సరైన చికిత్స అందించాని ఆదేవించారు.