80 మందికిపైగా ఉన్న ఒక ఓడ ఆకస్మాత్తుగా మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో అందులో ఉన్న 61 మంది మృత్యువాత చెందినట్లు సమాచారం అందింది. విషయం తెలిసిన స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
లిబియా(Libya) దేశంలోని తీర ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వలసదారులతో నిండిన ఓడ(boat) ప్రయాణిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు(sank) సమాచారం అందింది. ఆ క్రమంలో దానిలో ఉన్న మహిళలు, పిల్లలు సహా 80 మందికి పైగా ఉండగా..వారిలో ఇప్పటి వరకు 61 మంది మృతి చెందినట్లు తెలిసింది. ఇక ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన అధికారులు, స్థానికులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
🚨 #TRIPOLI: Around 61 #migrants were missing and presumed dead after their #boat sank off Libya’s coast, the International Organization for Migration (IOM) said Saturday, in the latest migrant tragedy off North Africa. pic.twitter.com/IaTpGx5Xvh
లిబియాలోని సైనిక సమూహాల ద్వారా మానవ అక్రమ రవాణా నెట్వర్క్ గత కొన్ని రోజులుగా వ్యాప్తి చెందుతుంది. ఈ నెట్వర్క్ ద్వారా వలసదారులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమాదానికి గురైన ఓడ వలసదారులతో లిబియా మీదుగా యూరప్ వెళ్తోందని పలువురు అంటున్నారు.