Canada: ఉన్నత విద్య కోసం కెనడా (Canada) వెళ్లిన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పంజాబ్‌లో (punjab) జలంధర్‌కు చెందిన ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ బ్రిజేశ్ మిశ్రా (brijesh mishra) దాదాపు 700 పైచిలుకు విద్యార్థులను (students) మోసం చేశాడు. ఫేక్ ఆఫర్ లెటర్లు (fake offer letters) ఇచ్చి కెనడా (canada) పంపించాడు. తీరా అక్కడికి వెళ్లాక అసలు విషయం తెలిసింది.
ఆ ఆఫర్ లెటర్లు ఫేక్ అని విద్యాసంస్థలు (educational institutions) గుర్తించాయి. టొరంటోలో గల మిస్సిసాగాలో ఉన్న కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీబీఎస్ఏ) కాన్ఫరెన్స్ సెంటర్ వెలుపల నిరసనకు (agitation) దిగారు. ఒంటరియాలో ఇలాంటి నిరసనలు జరుగుతున్నాయి. కెనడా ఇమిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రాసర్ను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో కాస్త రిలాక్స్ అయ్యారు.
పై చదువు కోసం కెనడా వెళ్లి, సదరు ఇనిస్టిట్యూట్‌లో కలువగా ఫేక్ సర్టిఫికెట్ అని తేలింది. దీంతో వారికి బహిష్కరణ లేఖలు అందజేసింది. స్వదేశం పంపించేందుకు కెనడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొందరు విద్యార్థులు (students) భారత్ (india) చేరుకున్నారని తెలిసింది. మరికొందరు గత నెల 29వ తేదీ నుంచి నిరసన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు అడుగుతున్నారు. విద్యార్థులను (students) కెనడా పంపించిన కన్సల్టెంట్ బ్రిజేశ్ మిశ్రా (brijesh mishra) అందుబాటులో లేరు. తమను నమ్మించి మోసం చేశారని.. న్యాయం చేయాలని అంటున్నారు.