4.5 million women, babies die every year during pregnancy: UN
4.5 million women, babies die:ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మంది (4.5 million) బాలింత/ గర్భవతులు- అప్పుడే పుట్టిన చిన్నారులు చనిపోతున్నారు. ప్రెగ్నెన్సీ, అప్పుడే పుట్టిన చిన్నారులు, పుట్టిన వారంలో ఈ మరణాలు జరుగుతున్నాయి. ఏడు సెకన్లలో ఒక మరణం నమోదవుతుందని ఐక్యరాజ్యసమతి మంగళవారం ఓ నివేదికలో పేర్కొంది. సరయిన చికిత్స లేకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయని. లేదంటే ఈ స్థాయిలో మృతుల సంఖ్య ఉండదని చెబుతుంది.
మాతా, శిశువు ఆరోగ్యం కోసం నిధుల కేటాయింపు 2015 నుంచి తగ్గుతూ వస్తోంది. దీంతో ఆ విభాగంలో మరణాలు జరుగుతున్నాయనే కఠోర నిజాన్ని తెలియజేసింది. 2015 నుంచి ఏటా 2.90 లక్షల ప్రసూతి మరణాలు జరుగుతున్నాయని పేర్కొంది. గర్భం ధరించి 28 వారాలు గడిచిన తర్వాత 1.9 మిలియన్ ప్రసవ మరణాలు జరిగాయి. 2.3 మిలియన్ల నవజాత మరణాలు జరిగాయని నివేదిక ద్వారా తెలిసింది.
ప్రపంచవ్యాప్తంగా గర్భవతులు, పసికందుల మరణాలు భారీగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ వల్ల ఆరోగ్య సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం లేకపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ అన్షు బెనర్జీ తెలిపారు. మహిళ, పసికందుల కోసం ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం భారీగా నిధులు కేటాయించాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల స్త్రీ, శిశువుల ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు అవుతుందని తెలిపారు.
కరోనా వైరస్ (corona virus) వల్ల పేదరికం మరింత పెరిగిందని, మానవతా విలువలు పడిపోయాయని.. ఆరోగ్య విభాగంపై ప్రభావం చూపింది. ప్రస్తుతం 10 దేశాలలో ఒక దేశంలో ప్రస్తుత ప్రణాళికను అమలు చేసేందుకు తగిన నిధులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది.
నాలుగింట ఒక వంతు దేశాలు గర్భం, ప్రసవానంతర సంరక్షణ, అనారోగ్యంతో ఉన్న పిల్లలకు సేవలకు అంతరాయం గురించి డబ్ల్యుహెచ్వో ప్రస్తావించింది. కరోనా వల్ల వెనకబడిన దేశాల్లో పిల్లలు, మహిళలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేసేందుకు వెనకాడాల్సి వచ్చిందని యునిసెఫ్ (UNICEF) డైరెక్టర్ స్టీవెన్ లావెరియర్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణలకు ప్రీ మెచ్యూరిటీ కారణం అవుతుంది. అనారోగ్యంతో ఉన్న పిల్లలకు చికిత్స చేయడానికి అన్ని దేశాల్లో తగిన సౌకర్యాలు లేవు. డెలివరీ సమయంలో మందులు, మంచి నీరు, విద్యుత్ సరఫరా, ఆరోగ్య కార్యకర్తలు అవసరం అని కేప్ టౌన్లో జరిగిన సదస్సులో నిపుణులు అభిప్రాయ పడ్డారు.