Israel: ఇజ్రాయిల్ పై సిరియా సరిహద్దు దేశాలనుంచి వరుస దాడులకు పాల్పడుతోంది. దీంతో దేశ ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. వరుసగా రాకెట్ బాంబులు ప్రయోగించడంతో దాడుల్లో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. మరణించిన వాళ్లలో ఓ ఇటలీ టూరిస్ట్ కూడా ఉన్నడని సమాచారం. జెరూసలెం అల్-అక్సా మసీదు ఘటన తర్వాత నుంచి పాలస్తీనా, లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సిరియా నుంచి రాకెట్ దాడులు జరిగాయి. అంతకుముందు రోజు ఇజ్రాయిల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు.
ఈ ఘటన తర్వాత ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ సైన్యం సమీకరణకు పిలుపునిచ్చారు. శనివారం రోజు సిరియా నుంచి రాకెట్ దాడులు జరిగాయి. సిరియా భూభాగం నుంచి మూడు రాకెట్లతో దాడులు జరిగినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది. బుధవారం అల్ – అక్సా మసీదులో పాలస్తీనియన్లు ఇజ్రాయిల్ భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ జరిగింది. దీని తర్వాత లెబనాన్ నుంచి పదుల సంఖ్యలో రాకెట్ దాడులు జరిగాయి. దీంతో ఇజ్రాయిల్ పాలస్తీనా గాజా స్ట్రిప్, లెబనాన్ లోని హమాస్ తీవ్రవాద స్థావరాలపై వైమానికి దాడులు జరిగాయి. గతేడాది డిసెంబర్ నెలలో బెంజిమెన్ నెతన్యాహూ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత నుంచి ఇజ్రాయిల్ వరస దాడులు ఎదుర్కోంటోంది.