Mexico: మెక్సికోలో (Mexico) భానుడు ప్రచండ రూపం దాల్చాడు. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు నమోదవుతుంది. వడగాలులు కూడా వీస్తున్నాయి. ఇప్పటివరకు 100 మందికి పైగా చనిపోయారని ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీలో చనిపోయిన వారు ఎక్కువ మంది ఉన్నారని పేర్కొంది. గత ఏడాది ఎండలు ఈ స్థాయిలో లేవు.. అప్పుడు ఒక్కరు మాత్రమే చనిపోయారని చెప్పింది.
మెక్సికోలో (Mexico) హై టెంపరేచర్ నమోదవుతుంది. దీంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఎనర్జీ గ్రిడ్ దెబ్బతిందని.. కొన్ని ప్రాంతాల్లో సర్వీసు నిలిపివేశామని అధికారులు చెబుతున్నారు. సరోనా రాష్ట్రంలో గల అకోంచి పట్టణంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు. మిగతా చోట్ల కూడా అదే స్థాయిలో టెంపరేచర్ ఉంటుంది. వడగాలులు వీస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండలు, వడగాలుల నేపథ్యంలో ఉదయం 8, 9 అయితే చాలు రోడ్ల మీదకి వచ్చేందుకు జనాలు జంకుతున్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావడం లేదు. కొందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటం వల్ల ఎండ వేడి నుంచి తప్పించుకుంటున్నారు. వడగాలులు వీయడంతో చల్లని పదార్థాలు తీసుకోవాలని.. నీరు, కొబ్బరి నీళ్లు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.