»The Bride Who Gave Birth To A Child The Day After The Wedding The Groom Was Shocked
Bride: పెళ్లి అయిన మరుసటి రోజే బిడ్డకు జన్మినిచ్చిన వధువు..షాకైన వరుడు!
వివాహం జరిగిన మరుసటి రోజే వధువు బిడ్డను ప్రసవించింది. ఈ షాకింగ్ ఘటనతో వరుడి కుటుంబీకులు అవాక్కయ్యారు. వధువు తల్లిదండ్రులకు తమ కూతురు గర్భవతి అని తెలిసినా దాచిపెట్టి పెళ్లి చేశారు. ఈ ఘటనతో ఇరు కుటుంబీకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
పెళ్లి(Marriage) అయిన మరుసటి రోజే వధువు(Bride) ప్రసవించింది. దీంతో వరుడి(groom)తో పాటుగా బంధువులంతా షాక్ అయ్యారు. సికింద్రాబాద్(Secunderabad)కు చెందిన మహిళకు గ్రేటర్ నోయిడాలోని ఓ వ్యక్తితో జూన్ 26న వివాహం జరిగింది. పెళ్లి అయిన రాత్రే ఆమెకు కడుపు నొప్పి రావడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు షాక్ అయ్యారు. పెళ్లికూతురు గర్భవతి(pregnent) అని తెలిపారు. ఆ మరుసటి రోజే ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయంలో పెళ్లికి ముందే వరుడి కుటుంబీకులు అనుమానం రావడంతో ప్రశ్నించారు. అయితే పెళ్లికూతురు(Bride) తల్లిదండ్రులు వేరే కారణం చెప్పారు. వధువు పొట్టలో రాళ్లు(Stones) తీయించుకునేందుకు ఆపరేషన్(operation) చేశారని, అందుకే కడుపు కొంచెం వాపుగా కనిపిస్తున్నట్లు తెలిపారు. దీంతో వారి సమాధానం విని వరుడి(Bridegroom) కుటుంబీకులు పెళ్లికి ఒప్పుకున్నారు.
అయితే వధువు(Bride) గర్భవతి(Pregnent) అని అప్పటికే ఆమె తల్లిదండ్రులు తెలుసు. వారు ఆ విషయాన్ని దాచిపెట్టి వివాహం(marriage) చేయాలనుకున్నారు. చివరికి అసలు విషయం బయటపడటంతో నోరెళ్లబెట్టారు. వధువు ప్రసవించడంతో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆమెను కోడలిగా స్వీకరించేందుకు వరుడి కుటుంబీకులు ఒప్పుకోలేదు. దీంతో నోయిడా నుంచి ఆమెను సికింద్రాబాద్(secunderabad)కు తీసుకొచ్చారు. ప్రస్తుతం తన కుటుంబీకుల మధ్య వధువు ఉంటోంది. ఈ విషయంలో ఎవ్వరూ పోలీసులను ఆశ్రయించలేదు.