Health Tips: చలికాలంలో పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టుకోవద్దు..!
చలికాలంలో కొన్ని రకాల ఆహారాలు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ సీజన్లో కొన్ని రకాల పదార్థాలు తీసుకోకుంటే చాలా మంచిది. మరి ఆ ఆహారాలేంటో ఒకసారి తెలుసుకుందాం.
చలికాలంలో మనకు చాలా ఫుడ్స్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ రాని ఫుడ్ క్రేవింగ్స్.. ఈ చలికాలంలోనే మనకు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని ఫుడ్స్ తింటే, మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకున్న వాళ్లం అవుతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చలికాలంలో తినకూడని ఆహారాలు ఇవే:
పకోడీలు, సమోసాలు, కారంగా ఉండే ఆహారాలు తింటే మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. మైదాతో తయారుచేసే ఆహారాలు అస్సలు తీసుకోకండి. పిజ్జా, బర్గర్, కేకులు, బ్రెడ్, శాండ్విచ్ వంటివి మధుమేహానికి దారితీస్తాయి. కాఫీ, టీ, స్మూతీలు, పనీర్, పాల సంబంధిత స్వీట్లు తింటే శ్లేష్మం పెంచుతాయి. పచ్చి కూరగాయలతో చేసిన సలాడ్లు అస్సలు తీసుకోకండి. చలికాలంలో వీటిని తీసుకుంటే బ్యాక్టీరియాను పెంచే ఇన్ఫెక్షన్లను అభివృద్ధి చేస్తాయి. చలికాలంలో మాంసం ఎక్కువగా తీసుకోకండి. అది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. గుండె సమస్యలకు దారితీస్తుంది.
చలికాలంలో తినాల్సిన ఆహారాలు ఇవే:
చలికాలంలో డ్రై ఫ్రూట్స్, నట్స్, గోధుమ పిండితో చేసిన రోటీలు, పూరీలు తింటే మంచిది. అలాగే తేనె, అల్లం, వెల్లుల్లి, పాలు, ఆకుకూరలు తీసుకుంటే ఆరోగ్యం బావుంటుంది. అలాగే వేడిగా ఉండే ఆహారాలు తినండి. తగినంత నీరు తాగండి. వ్యాయామం చేయండి.