TG: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈనెల 20వ తేదీ నుంచి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 29న స్వామివారికి తెప్పోత్సవం, 30న ఉత్తర ద్వార దర్శన పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇందుకు టికెట్లను అధికారిక వెబ్ సైట్ నుంచి పొందవచ్చని అధికారులు తెలిపారు. ఆన్ లైన్ లో టికెట్లను బుక్ చేసుకున్న వారు రామాలయం కార్యాలయంలో ఒరిజినల్ టికెట్లను తీసుకోవాలి.