కూటమి ప్రభుత్వం చేస్తున్న జిల్లాల పునర్విభజనతో రామచంద్రపురం రెవిన్యూ డివిజన్ పూర్తిగా కనుమరుగు అయ్యే అవకాశలు ఉన్నాయని రామచంద్రపురం వైసీపీ ఇంచార్జి పిల్లి సూర్యప్రకాశ్ విమర్శించారు. గురువారం రాత్రి ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం రెవిన్యూ డివిజన్ కాపాడటంలో మంత్రి సుభాష్ వైఫల్యం చెందారన్నారు. రెవెన్యూ డివిజన్ ను యధాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.