TG: దిత్వా తుఫాన్ తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత క్షీణిస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. ఇక రాబోయే 4 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో.. శుక్ర, శనివారాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.