W.G: నరసాపురం మండలంలోని పలు గ్రామాల్లోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలు, సహకార సంఘాలను వ్యవసాయశాఖ అధికారులు గురువారం తనిఖీ చేశారు. 2025 పంట సాగు కాలానికి గాను ఆకివీడు సహాయ సంచాలకులు ప్రతాప్ జీవన్ నరసాపురం, చిట్టవరం, సీతారాంపురం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. డీలర్లకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలలో ఏవో జ్యోషిలా పాల్గొన్నారు.