TG: నవంబర్ 26వ తేదీ నుంచి శుక్రమూఢం మొదలు కావడంతో పెళ్లిళ్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి 17 తర్వాతనే వివాహాది శుభకార్యాల నిర్వహణకు అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26.. మొత్తం 6 రోజులపాటు పెళ్లిళ్లకు అనుకూలంగా ఉందని పండితులు చెప్తున్నారు. అలాగే మార్చిలో 8, ఏప్రిల్ నెలలో 8 రోజుల చొప్పున ముహూర్తాలు ఉన్నాయి.