KRNL: గోనెగండ్ల మండలం గాజులదిన్నె జలాశయంలో ఉన్న నీటి నిల్వ ద్వారా మునిగిపోతున్న భూములపై JC నూరుల్ ఖమర్ విచారణ చేపట్టారు. గురువారం గాజులదిన్నె జలాశయం గేట్లను, నీటి సామర్థ్యాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం భూముల వివరాలపై తహసీల్దార్, ప్రాజెక్టు DE సుబ్బరాయుడును విచారించారు. మునకకు గురైన ఐరన్ బండ, ఎనగండ్ల గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించారు.