ATP: జిల్లా నిరుద్యోగ యువత కోసం ఈ నెల 9న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి పల్లవి తెలిపారు. కోర్టు రోడ్డు సమీపంలోని కార్యాలయంలో ఈ మేళా జరుగుతుందని చెప్పారు. 18-32 సంవత్సరాల లోపు వయసు, ఇంటర్మీడియట్ వరకు చదివిన అభ్యర్థులు స్ఫూర్తి ఫైనాన్స్ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.