NRPT: జిల్లాలోని ఎస్పీ పరేడ్ మైదానంలో ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన లాన్ టెన్నిస్ కోర్టును కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డాక్టర్ వినీత్ గురువారం రాత్రి ప్రారంభించారు. పని ఒత్తిడిని దూరం చేసి, సిబ్బంది శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ఫిట్నెస్ను మెరుగుపరచడమే లక్ష్యమని ఎస్పీ వినీత్ అన్నారు.