నిర్వహణపరమైన లోపాల కారణంగా HYDతో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైల్లోని విమానాశ్రయాల్లో నిన్న ఇండిగో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలు విమానాలు రద్దుకావడంతోపాటు ఆలస్యంగా నడుస్తుండటంతో గందరగోళం నెలకొంది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వరకు ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 8 నుంచి విమానాలను తగ్గించనున్నట్లు వెల్లడించారు.