PLD: నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండపై వేంచేసి ఉన్న త్రికోటేశ్వర స్వామి ఆలయంలో రేపు ఆరుద్రోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు వివరాలను ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. మాల ధరించిన స్వాములు జ్యోతి దర్శనం అనంతరం దీక్ష విరమణ చేస్తారన్నారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు జరుగుతాయన్నారు.