KRNL: ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని సివిక్స్ సొసైటీ కన్వీనర్ రఘురాం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆదోనితో పాటు 5 నియోజకవర్గాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సివిక్స్ సొసైటీ తరఫున క్యూఆర్ కోడ్ను విడుదల చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ఆన్ లైన్లో సంతకం చేయాలన్నారు.