TG: శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటలు ఆలస్యం కావడంతో నిరసన వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం HYD నుంచి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డింగ్ గేటుకు అడ్డంగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.