KNR: వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గురువారం బీజేపీలో చేరారు. గాజుల సంపత్, పాకాల రవీందర్ రెడ్డి, గాజుల అశోక్, చంద్రయ్య విజయ్ కోమల్ రెడ్డిలకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.