KNR: కరీంనగర్ రీజియన్ పరిధిలో 11 RTC డిపోలుండగా అందులో కరీంనగర్-2 డిపో ప్రైవేట్ పరంవైపు అడుగులేస్తోంది. ఈ డిపోలో ప్రైవేట్ నిర్వహణలో నడుస్తున్న 100 ఎలక్ట్రిక్ బస్సులు, హైర్ విత్ బస్సెస్ 32 ఉండగా RTC బస్సులు కేవలం 20 మాత్రమే ఉన్నాయి. కరీంనగర్-2 డిపోలో పనిచేస్తున్న 51 మంది ఉద్యోగులను ఇప్పటికే ఇతర డిపోల్లోని వివిధ విభాగాలకు బదిలీ చేశారు.