NDL: కొలిమిగుండ్లలో ఈనెల 14న మెగా హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ జిల్లా నాయకులు దాసరి శ్రీనివాసులు రాముడు నాయక్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించి, కరపత్రాలను విడుదల చేశారు. హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి, సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.