ప్రకాశం: కంభం మండలంలోని జంగంగుంట్లలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పులిగుజ్జు శ్రీవల్లి (12) అనే 7వ తరగతి విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న విద్యార్థినిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కంభంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీవల్లి మృతి చెందింది.