Diabetic foods : చిన్న వయసులోనే షుగరా? ఈ ఆహారాలు వద్దు !
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా వయసులో చిన్నవారికీ మధుమేహం వచ్చేస్తోంది. వారు కచ్చితంగా దూరంగా ఉండాల్సిన ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...
Worst Foods for Diabetes : పెద్ద వారికి డయాబెటిస్ ఉంటే వారు ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే చిన్న వారికి ఈ విషయంలో కంట్రోల్ తక్కువగా ఉంటుంది. అయితే వారూ కొన్ని ఆహారాలకు తప్పకుండా దూరంగా ఉండాలి. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీన్నే డయాబెటిస్(Diabetes) అని పిలుస్తారు. అతి మూత్రం, అతి దాహం, చూపు మందగించడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే షుగర్ చెక్ చేయించుకోవడం మంచిది. వీరు తినకూడని ఆహారాలు(Foods) ఏమిటంటే…
కూల్ డ్రింక్‌లు, ఎనర్జీ డ్రింక్‌లు, మిల్క్ షేక్‌లు, పంచదార ఎక్కువగా ఉండే ఫ్రూట్ జ్యూస్‌లు, టీలు.. లాంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం. ఇవి ఒక్కసారిగా రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచేస్తాయి. ఎక్కువగా క్యాలరీలు శరీరంలోకి వచ్చేసేలా చేస్తాయి. ఇంకా పూరీలు, బోండాలు, బజ్జీలు, పకోడీలు, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఫిష్ లాంటి నూనెలో వేపించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటి ద్వారా ఎక్కువగా కొవ్వు, సోడియం, నూనె శరీరంలోకి వెళతాయి. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.
ఎక్కువగా మద్యం తాగే వారికి రక్తంలో చక్కెర స్థాయిలు అస్తవ్యస్థంగా తయారవుతాయి. ఒకసారి పెరగడం, ఒకసారి తగ్గడం అన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది. డయాబెటిక్‌కి వాడే మందులతోనూ ఇది చర్య జరిపే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని కచ్చితంగా దూరం పెట్టాలి. అరటిపండ్లు, మామిడి పండ్లు, సపోటా, పుచ్చకాయలాంటి చక్కెర ఎక్కువగా ఉండే పండ్లకు దూరంగా ఉండాలి. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిల్ని వేగంగా పెంచుతాయి. అలాగే మైదాతో చేసినవి, ప్రోసెస్ చేసిన, ప్యాక్డ్ ఫుడ్లకు దూరంగా ఉండాలి. వీటిలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, సోడియం ఎక్కువగా ఉంటాయి. అలాగే తియ్యటి సెరెల్స్, చాక్లెట్లు, క్యాండీలు… లాంటి వాటికి దూరంగా ఉండాలి.