Honda NX500 : హోండా ప్రీమియం బైక్ డెలివరీలు ప్రారంభం
ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా నుంచి ప్రీమియం బైక్ హోండా ఎన్ఎక్స్500 డెలివరీలు ప్రారంభం అయ్యాయి. దీని ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలియాలంటే ఇది చదివేయాల్సిందే.
Honda NX500 : బైక్ లవర్లు కాస్ట్లీ బైకులు కొనుక్కోవాలని కలలు కంటూ ఉంటారు. వాటి మీద రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి బైక్ ప్రేమికుల కోసం హోండా కంపెనీ ప్రీమియంగా ఉండే హోండా ఎన్ఎక్స్500 (NX500) బైక్‌ని మార్కెట్లోకి విడుదల చేసి డెలివరీలూ మొదలు పెట్టేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.5,90,000గా ఉంది.
ఇది మూడు రంగుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. గ్రాండ్ ప్రి రెడ్, మాటే గన్ పౌడర్ బ్లాక్ మెటాలిక్, పర్ల్ హారిజన్ వైట్ ల్లో లభిస్తోంది. ఆసక్తి ఉన్న రైడర్లు త్వరలో దీని మీద రైడింగ్ థ్రిల్‌ని అనుభవిస్తారని సంస్థ వెల్లడించింది. లాంగ్ రైడ్లకు వెళ్లే సమయంలో అదనపు సౌకర్యం కోసం ఈ బైక్ సింగిల్ సీట్ తో వచ్చింది. కాంపాక్ట్‌గా ఉండే అడ్వంచరస్ లుక్‌తో దీని డిజైన్ అదరహో అన్నట్లుగా ఉంది.
దీనిలో డ్యూయల్ ఛానల్ ABS బ్రేకింగ్ విధానం ఉంది. దీని యునీక్ డిజైన్ వల్ల ఇది అటు సిటీ వీధుల్లో అయినా, ఇటు సాధారణ పాత్‌వేలు, కంకర రోడ్ల మీద కూడా చక్కగా నడిపేందుకు వీలవుతుంది. అన్ని రోడ్ల మీదా సౌకర్యవంతమైన రైడ్‌ని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. NX500కి 471 సీసీ సమాంతర ట్విన్ ఇంజిన్ ఉంది. ఇది 8,600 ఆర్పీఎం దగ్గర గరిష్ఠంగా 47bhp పవర్‌ని ఇస్తుంది. 6 – స్పీడ్ గేర్ బాక్స్‌తో వచ్చింది. దగ్గరలోని హోండా షోరూంల నుంచి ఆసక్తి ఉన్న వారు దీన్ని బుక్ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.