Eetha Vanam: సిటీకి దగ్గరలో ఈత వనం, 2 వేల చెట్లు.. ఈత, నీరా, కర్జూర కల్లు
హైదరాబాద్ దగ్గరలో గల తుఫ్రాన్ వద్ద ఈత వనం ఉంది. లచ్చగౌడ్ అనే వ్యక్తి వనంలో 2 వేల చెట్లు ఉన్నాయి. వీటి నుంచి ఈత కల్లు, నీరా, కర్జూర కల్లు గీసి అందిస్తారు.
Eetha Vanam: ఈత కల్లు (Eetha kallu) తాగాలి అని పెద్దలు చెబుతుంటారు. కడుపులో ఉన్న చెత్తను క్లియర్ చేస్తుందని.. కిడ్నీలో రాళ్లు పోతాయని అంటుంటారు. ఇక చలికాలంలో ఈత కల్లుకు (toddy) ఉండే గిరాకీ వేరు. ఈత, తాటి కల్లు అంటే కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక సిటీకి చెందిన వారు అయితే చాలు.. దూరం వెళ్లేందుకు వెనకాడరు.
మెదక్ (medak) జిల్లా తుఫ్రాన్ మండలం బ్రహ్మణపల్లిలో ఓ ఈత వనం ఉంది. ఇది 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లచ్చ గౌడ్ (lacha goud) అనే వ్యక్తి ఈత మొక్కలు నాటాడు. ఊరిలో అతనికి గౌడ్స్ చెట్లు ఇవ్వకపోవడంతో ఇక్కడ వనం ఏర్పాటు చేశాడు. అవి పెరగడంతో కల్లు, ఖర్జుర కల్లు, నీరా అందిస్తున్నాడు. గత 17 ఏళ్ల నుంచి ఏ కల్తీ లేని కల్లు ఇస్తున్నాడు.
వనంలో మొత్తం 15 మంది వరకు ఉంటారని ఆయన చెబుతున్నాడు. వచ్చిన వారు ఫుడ్ కావాలంటే.. చికెన్ (chicken), మటన్ (mutton) కూడా వండిస్తామని వెల్లడించారు. ఒక్కో రోజును బట్టి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు గిరాకీ అవుతుందని ఓనర్ లచ్చగౌడ్ (lacha goud) తెలిపారు. శని, ఆదివారాల్లో గిరాకీ ఎక్కువ అని వివరించాడు.
స్టఫ్ కూడా బాగా దొరుకుతుంది. నాన్ వెజ్.. గుడ్లు, గుడాలు, పల్లీలు, శనగలు, బఠానీ అన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన కొందరు బీర్, విస్కీ కన్నా ఈత కల్లు మేలు అని.. పొట్ట సాఫ్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.