»Drinking Too Much Lemon Juice Can Cause These Five Diseases
lemon juice: నిమ్మరసం ఎక్కువగా తాగితే.. ఈ వ్యాధులు వచ్చే ఛాన్స్!
సాధారణంగా నిమ్మరసం తీసుకుంటే మంచిదని తెలుసు. కానీ ఇదే నిమ్మకాయను ఎక్కువగా స్వీకరించడం ద్వారా కొన్ని వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిమ్మరసం ఎక్కువగా తాగినప్పుడు జరిగే ప్రమాదకరమైన విషయాలు ఏంటో ఇప్పుడు చుద్దాం.
ఎండాకాలం వచ్చిందంటే చాలు. సాధారణంగా ప్రజలు నిమ్మరసం ఎక్కువగా స్వీకరిస్తారు. సమ్మర్లో నిమ్మరసాన్ని నీటిలో కలుపుకుని ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. అయితే అలా చేయడం ద్వారా ఎండ నుంచి ఉపశమనంతోపాటు డీ హెడ్రేషన్ కూడా తగ్గుతుంది. కానీ నిమ్మరసం అతిగా తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దంతాలు దెబ్బతీనే అవకాశం
నిమ్మకాయలు చాలా ఆమ్లత్వంతో కూడి ఉంటాయి. కాబట్టి తరచుగా లెమన్ తీసుకోవడం ద్వారా మీ దంతాల ఎనామిల్ ధ్వంసం అయ్యే అవకాశం ఉందని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిమ్మరసం తాగిన వెంటనే పళ్ళు తోముకోకూడదని వైద్యులు సూచించారు. దీంతోపాటు సిట్రస్ కలిపిన నీటితోపాటు సాధారణ నీటిని కూడా పుష్కలంగా త్రాగాలని డాక్టర్లు సూచించారు.
కడుపులో కలవరం
మీ నీటిలో లెమన్ ఎక్కువగా పిండడం వల్ల గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD), యాసిడ్ రిఫ్లక్స్ వంటి అనారోగ్యాలు మరింత తీవ్రమవుతాయని వైద్యులు చెబుతున్నారు. GERD నిమ్మకాయలు వంటి ఆమ్ల ఆహారాల ద్వారా ప్రేరేపించబడతాయని వెల్లడించారు. ఆ క్రమంలో గుండెల్లో మంట, వికారం, వాంతులు కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అంతేకాదు నిమ్మ కాయల తొక్కలను నీటిలో వేసుకుని సేవించకూడదని నిపుణులు పేర్కొన్నారు. వాటిపై అనేక రకాల సూక్ష్మజీవులు ఉన్నాయని వాటి ద్వారా ఎలర్జీ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ క్రమంలో మీ డ్రింక్‌లో నిమ్మకాయను పిండిన తర్వాత వాటిని పడేయాలని చెబుతున్నారు.
క్యాన్సర్ పుండ్లు
నిమ్మకాయ నీరు అధికంగా స్వీకరించడం ద్వారా ఆమ్లత్వం ఏర్పడి క్యాన్సర్ పుండ్లకు కారణం కావచ్చని వైద్యులు వెల్లడించారు. దీంతోపాటు చికాకు, నిద్రలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. మరోవైపు ఎక్కువ నిమ్మకాయ నీరు తాగడం వల్ల క్యాన్సర్ పుండ్లు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
మైగ్రేన్ కు కారణం
కొన్ని సంవత్సరాలుగా పలు అధ్యయనాలు సిట్రస్ పండ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా మైగ్రేన్(తలనొప్పి) ఏర్పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. నిమ్మకాయల్లో టైరమైన్ ఎక్కువగా ఉండటం వల్ల తలనొప్పికి దారితీసే అవకాశం ఉందని తెలుస్తోంది.