coconut water and lemon juice:కొబ్బరి బోండం, నిమ్మకాయ రసం కలిపి తాగొచ్చా?
coconut water and lemon juice:కొబ్బరి బొండంలో (coconut) నిమ్మరసం (lemon juice) కలిపి తాగితే మంచిదే. డీ హైడ్రేషన్ తొందరగా ఎదుర్కొవచ్చు. వెంటనే శక్తిని అందజేస్తోంది. స్కిన్ (skin) హెల్దీగా ఉండేందుకు సాయం చేస్తోంది. కొబ్బరి బొండం, నిమ్మ రసం కలిపి తీసుకుంటే విటవిన్లు, ఖనిజాలు పుష్కలం.. ఎలక్ట్రోలైట్లను ఇస్తోంది.
coconut water and lemon juice:వేసవి వచ్చేసింది. శివరాత్రి తర్వాత ఎండల ప్రభావం మొదలవుతోంది. ఈ సారి కాస్త ఎక్కువే ఉండనున్నాయి. వాతావరణ శాఖ చెప్పడంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఏదో పని కోసం బయటకు వెళతారు.. కదా.. మరీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఎలాంటి పానీయాలు తీసుకోవాలి. సమ్మర్లో అయితే పుచ్చకాయ, పుదీనా జ్యూస్ (pudina juice), నిమ్మరసం (lemon juice), కొబ్బరి బొండం (coconut), ఫ్రూట్ జ్యూస్ (juice) తీసుకుంటారు.
పైన చెప్పిన ఐటెమ్ ఓకే.. మరీ కొబ్బరి బొండంలో (coconut) నిమ్మరసం (lemon juice) కలిపితే ఎలా ఉంటుంది. అలా తాగొచ్చా.. వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి. ఈ రెండు కలిపి తాగితే మంచిదే. డీ హైడ్రేషన్ తొందరగా ఎదుర్కొవచ్చు. వెంటనే శక్తిని అందజేస్తోంది. స్కిన్ (skin) హెల్దీగా ఉండేందుకు సాయం చేస్తోంది. కొబ్బరి బొండం, నిమ్మ రసం కలిపి తీసుకుంటే విటవిన్లు, ఖనిజాలు పుష్కలం.. ఎలక్ట్రోలైట్లను ఇస్తోంది. ఇవీ బాడీలో నీటిని భర్తీ చేయడానికి హెల్ప్ అవుతుంది. పిల్లలు (kids), ఎక్సర్ సైజ్ చేసిన తర్వాత గర్భిణీ స్త్రీలు కూడా తీసుకోవచ్చు.. అథ్లెట్లకు మంచి ఛాయిస్ అని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.
కొబ్బరి నీరు (coconut), నిమ్మకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కవుగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, ఇతర ఎలక్ట్రోలైట్ ఉంటాయి. డీ హైడ్రేషన్ చేసేందుకు ఉపయోగ పడుతుంది. నిమ్మకాయల్లో (lemon) విటిమిన్ సీ, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడతాయి. కొబ్బరి నీళ్లను నిమ్మరసంతో కలపి పానీయంగా తీసుకోవడం వల్ల.. రెండింటి ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.
అయితే ఈ రెండింటినీ కలిపి అందరూ తీసుకోవద్దు. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, రక్తపోటు సమస్య, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవారు తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. దీంతో వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సో.. వీరు తప్ప, మిగతావారు ఏం చక్కా కొబ్బరి బొండం.. నిమ్మరసం కలిపి తాగెయచ్చు.