సాహో డైరెక్టర్ సుజీత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో ఓజి అనే ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా రాబోతున్నాడని ఎప్పుడైతే ప్రకటించారో.. అప్పటి నుంచి ఎన్నో రూమార్స్ హల్చల్ చేస్తున్నాయి.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడుంటుందో చెప్పలేం.. పాటలు, ఫైట్స్ లేవట, పవన్ నెల రోజుల కాల్షిట్స్ మాత్రమే ఇచ్చాడని.. రెండు భాగాలుగా రాబోతోంది.. హీరోయిన్ కూడా ఉండదని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో సడెన్ సర్ప్రైజ్ చేస్తూ.. ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్‌కు కొబ్బరికాయ కొట్టేశారు పవన్. ఇది పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. దీంతో నెక్స్ట్ ఓజి సెట్స్ పైకి వెళ్లడమే లేట్ అంటున్నారు. అయితే ఈ సినిమాలో పాటలు, ఫైట్స్‌తో పాటు హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో పవర్ స్టార్‌తో ఛాన్స్ కొట్టేసే ఆ బ్యూటీ ఎవరనేది ఇంట్రెస్టింగ్గా మారింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. భీమ్లానాయక్ సినిమాలో నటించిన సంయుక్త మీనన్ పేరు తెరపైకి వచ్చింది. భీమ్లా నాయక్‌లో పవన్ సరసన నిత్య మీనన్ జంటగా నటించగా.. రానా సరసన సంయుక్త జోడి కట్టింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ నటించింది. ప్రస్తుతం ధనుష్ సరసన ‘సార్’ మూవీతో పాటు. ఇంకొన్ని సినిమాల్లోను నటిస్తోంది. ఇక ఇప్పుడు ఓజిలో అమ్మడి పేరు వినిపిస్తోంది. కాకపోతే హీరోయిన్గా కాకుండా ఈ బ్యూటీని ఓ స్పెషల్ రోల్ కోసం తీసుకోబోతున్నారట. సినిమాలో ఆమెది కీ రోల్ అని తెలుస్తోంది. అయితే సంయుక్త స్పెషల్ రోల్ అయితే.. మరి హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. త్వరలోనే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.