Prabhas-Ram Charan : ఈ సారి పాన్ ఇండియా వార్ కాస్త గట్టిగానే జరగబోతున్నట్టు తెలుస్తోంది. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోగా.. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ సారి పాన్ ఇండియా వార్ కాస్త గట్టిగానే జరగబోతున్నట్టు తెలుస్తోంది. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోగా.. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పుడదే జరగబోతోంది. 2024 సంక్రాంతికి కొన్ని భారీ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే ముందుగా ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ సంక్రాంతికి రాబోతున్నట్టు ప్రకటించారు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ మూవీని జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసేశారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా.. కాబట్టి సంక్రాంతి రేసులో ప్రభాస్ తగ్గే అవకాశాలు తక్కువ. కానీ రామ్ చరణ్ నటిస్తున్న ఆర్సీ 15 కూడా.. దాదాపుగా సంక్రాంతికే రాబోతున్నట్టు తెలుస్తోంది. పోయిన సంక్రాంతికి వారసుడు సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచిన దిల్ రాజు.. 2024లోను తగ్గేదేలే అంటున్నారట. ముందుగా 2024 సమ్మర్లో ఆర్సీ అనుకున్నప్పటికీ.. ఇప్పుడు సంక్రాంతి టార్గెట్‌గా షూటింగ్ ప్లాన్ చేసుకున్నాడట శంకర్. ప్రతి సంక్రాంతికి రెండు మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం మామూలే. కాబట్టి.. ప్రభాస్, చరణ్ వార్ ఫిక్స్ అయినట్టే. అయితే.. ప్రభాస్‌తో పోటీ అంటే.. ఎదురుగా ఏ సినిమా నిలిచినా రిస్క్ తప్పదు. ఎందుకంటే తెలుగులో తప్పితే.. మిగతా భాషల్లో ప్రభాస్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరోకి లేదు. కాబట్టి.. నెక్స్ట్ సంక్రాంతి వార్ ఇంట్రెస్టింగ్గా మారనుంది.