Prabhas Vs Ram Charan : ప్రభాస్‌ని వెనక్కి నెట్టిన రామ్ చరణ్!
Prabhas Vs Ram Charan : బాహుబలితో ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా డార్లింగ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అయితే సాహో, రాధే శ్యామ్ సినిమాలు కూడా హిట్ అయి ఉంటే.. ప్రభాస్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లేది. అయినా కూడా ఈ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు కదా..
బాహుబలితో ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా డార్లింగ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అయితే సాహో, రాధే శ్యామ్ సినిమాలు కూడా హిట్ అయి ఉంటే.. ప్రభాస్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లేది. అయినా కూడా ఈ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు కదా.. అప్ కమింగ్ సినిమాలతో హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లడం ఖాయం. అయినా కూడా ఓ దేశంలో రామ్ చరణ్, ప్రభాస్‌ని వెనక్కి నెట్టేశాడు. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్. ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాడు. అందుకే చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. జపాన్ దేశంలో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రభాస్‌ను సైతం వెనక్కి నెట్టేశాడు చరణ్. జపాన్‌లో ఇండియా నుంచి భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోస్గా చరణ్, ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలిచారు. లేటెస్ట్గా జపాన్‌కి చెందిన మూవీ ప్లస్ అనే ఓ ప్రముఖ ఛానెల్.. తమ దేశంలో మోస్ట్ పాపులర్ ఇండియన్ హీరో ఎవరు? అంటూ ఓ పోల్ నిర్వహించింది.
ఈ లెక్కల ప్రకారం.. రామ్ చరణ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా..
ప్రభాస్ రెండో స్థానంలో నిలిచాడు.
ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ థర్డ్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు.
ఎన్టీఆర్ నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే మనది కాని దేశంలో బాలీవుడ్ స్టార్స్‌ని పక్కకు పెట్టేసి.. టాలీవుడ్ స్టార్స్ టాప్ 2లో ఉండడం విశేషం. ప్రస్తుతం చరణ్, శంకర్‌తో కలిసి ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తుండగా.. ప్రభాస్ ఏమో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమాలతో చరణ్, ప్రభాస్ క్రేజ్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.