Kiran Abbavaram-Mass Raja : ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడు మీదున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అది కూడా టాలీవుడ్ బడా సంస్థల నిర్మాణంలో సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్‌గా గీతా ఆర్ట్స్‌లో చేసిన 'వినరో భాగ్యము విష్ణుకథ' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు.
Ravi Teja : ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ.. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఏంటి.. వెంటనే నెల రోజుల గ్యాప్‌లో సాలిడ్ హిట్స్ అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ధమకా, వాల్తేరు వీరయ్యతో 300 కోట్లు కొల్లకొట్టి.. మాస్ రాజా స్టామినా ఏంటో చూపించాడు.
Vikram-Kaarthi : లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్' రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. విక్రమ్, కార్తి, జయంరవి, ఐశ్వర్యరాయ్, త్రిషతో పాటు కోలీవుడ్‌కు చెందిన టాప్ స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది సెప్టెంబర్ 30న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ అయింది ఫస్ట్ పార్ట్.
Sree Leela : యంగ్ బ్యూటీ శ్రీలీల.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ అందుకుందనే న్యూస్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'లో శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
Ram : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. షాక్ ఇవ్వబోతున్నారా అంటే, ఇండస్ట్రీ వర్గాల్లో ఔననే వినిపిస్తోంది. ఇప్పటి వరకు బోయపాటి చేసిన సినిమాలు.. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కాయి.
RRR : మరో పది రోజుల్లో హిస్టరీ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది ఆర్ఆర్ఆర్ మూవీ. ఏ ముహూర్తాన రాజమౌళి ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టారో గానీ.. అవార్డుల పంట పండుతోంది. ఇప్పటికే ఎన్నో అవార్డులు ఆర్ఆర్ఆర్ ఖాతాలో పడిపోయాయి. ఇంకొన్ని రోజులు పోతే.. ఆర్ఆర్ఆర్ పేరు మీదే అవార్డ్స్ ఇచ్చేలా ఉన్నారు హాలీవుడ్ ప్రముఖులు.
Natural Star : ఈ మధ్య సినిమాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ పై టీజర్, ట్రైలర్ ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. టీజర్, ట్రైలర్‌తో అట్రాక్ట్ చేస్తే చాలు.. ఆటోమేటిక్‌గా సోషల్ మీడియానే సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసేస్తుంది. లేదంటే మేకర్స్.. బజ్ కాదు కదా, దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిందే.
Sudhir Babu : సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నైట్రో స్టార్ అనే బిరుదుతో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. రీసెంట్‌గానే 'హంట్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు.
'SIR' : కరోనా కాలంలో ఓటిటికి బాగా అలవాటు పడిపయారు జనాలు. ఓటిటి సంస్థలు కూడా సరికొత్త కంటెంట్‌తో ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమాలను.. భారీ రేటు చెల్లించి ఓటిటి రైట్స్ సొంతం చేసుకుంటున్నాయి.
NTR : మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలయ్య, ప్రభాస్ అభిమానులు.. కొత్త సినిమాలతో పాటు రీ రిలీజ్ జోష్‌లో ఉన్నారు. తమ హీరోల హిట్ సినిమాలను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూసి పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.
Sreeleela : రాఘవేంద్ర రావు 'పెళ్లి సందడి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ హాట్ కేక్‌గా మారిపోయింది. ఇప్పటికే యంగ్ హీరోలతో పాటు మాస్ మహారాజా రవితేజతోను జోడి కట్టింది. నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్, రామ్ పోతినేని, నితిన్ లాంటి యంగ్ హీరోలతో పాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోను ఛాన్స్ అందుకుంది.
Anushka : బాహుబలి 2 తర్వాత చాలా వరకు సినిమాలు తగ్గించేసింది అనుష్క. చివరగా నిశ్శబ్దం సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ తర్వాత మొత్తంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసినంత పని చేసింది. కానీ ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
RX 100 Combo : చాలామందికి మంగళవారం అశుభం.. కొందరికీ శుభం.. కానీ కొందరికి అదో సామెత.. అసలు మంగళ వారంతో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ఏం చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే తమిళ్ సూపర్ హిట్ మూవీ 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేశారు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Pushpa 2 & Aadipurush : రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు రాబోతున్నాయా.. అంటే రిలీజ్ అనుకునేరు. అసలు మ్యాటర్ వేరే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.